నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బూతు స్థాయి కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నగారా మ్రోగించారు. బోధన్ పట్టణంలో ఐదు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తల స్థాయి మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో, నియోజకవర్గంలో ఇప్పటివరకు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. దాదాపు 1800 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలలోకి వెళ్లాయని తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. మత రాజకీయాలు చేసే అలవాటు మాకు లేదు అని అన్నారు. అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోతామని అన్నారు. ఒక్క బోధన్ పట్టణంలోని పదివేల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చామని అన్నారు.
పని చేసి చూపిస్తామని అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదని అన్నారు. తెలంగాణ వచ్చాక 158 చెరువులను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. బోధనలో సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యల పోటీ ఉందన్నారు సీనియార్టీ కావాలో సిన్సియారిటీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. బోధనలో 4500 మహిళా గ్రూపులు ఉన్నాయని వారందరికీ 4600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామన్నారు. అతి త్వరలో గడపగడపకు బిఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నిజామాబాదులో ఇటీవల ప్రారంభించిన ఒక్క ఐటీ హబ్ లోని 250 ఉద్యోగాలు ఇచ్చామన అన్నారు. టిఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ. మనది పేగు బంధం వాళ్లది ఓటు బంధం. రైతులకు ఈ లక్ష రూపాయల రుణమాఫీ అందించాము. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మందికి రుణమాఫీ చేశాము. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నాను ఆలోచించండి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసిలు జెడ్పిటిసిలు సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Post