అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్-రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ అసెంబ్లీ వార్‌ను సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ అయిదు రాష్ట్రాల్లో విజయకేతనాన్ని ఎగురవేయడం ద్వారా సార్వత్రిక ఎన్నికలపై ఆధిపత్యాన్ని కనపర్చాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్‌సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితేమిటనేది ఈ పోల్ స్పష్టం చేసింది. ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారనేది తేల్చి చెప్పింది. కేంద్రంలో అధికారంలో ఎవరు వస్తారనేది కుండబద్దలు కొట్టింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయనేది వెల్లడించింది. రాష్ట్రాలు, పార్టీల వారీగా మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది తేల్చేసింది. తాజా రాజకీయాలనూ విశ్లేషించింది.
ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం- కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్షాల సంకీర్ణ కూటమి ఇండియా గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని అంచనా వేసింది. అంటే- ప్రస్తుతం టీడీపీకి ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య మూడు. దీన్ని ఏడుకు పెంచుకోగలుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ కనీస పోటీని కూడా ఇవ్వలేవని తేల్చి చెప్పింది ఇండియా టీవీ ఒపీనియన్ పోల్. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్-8, బీజేపీ-6, కాంగ్రెస్-2, ఏఐఎంఐఎం- 1 స్థానాలు గెలుచుకోగలుగుతాయి. ఈ ఒపీనియన్ పోల్ కోసం ఇండియా టీవీ.. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీని లెక్కలోకి తీసుకోలేదు. బీజేపీ-జనసేన పొత్తులో కొనసాగుతున్నాయని భావించి ఉండటమే దీనికి కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా ఒపీనియన్ పోల్- వైఎస్ఆర్సీపీలో ఉత్సాహాన్ని నింపినట్టయింది. 175కు 175 అసెంబ్లీ స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్‌కు మాత్రం కొంత నిరుత్సాహాన్ని కలిగించినట్టే. క్లీన్ స్వీప్ సాధ్యపడదని ఈ పోల్ స్పష్టం చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే- లోక్‌సభ స్థానాల విషయంలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకొన్నట్టే. ఇప్పుడున్న ఎనిమిది స్థానాలే బీఆర్ఎస్‌కు దక్కుతాయి.
Prev Post
Next Post