- తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్‌లో అధికారుల నిర్లక్ష్యం
- తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నేమ్ ప్లేట్ బోర్డు
- ఉర్దూని కూడా కలిపి బోర్డు చేయించాలని ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను మందలించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించారని తలంటు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అధికారిక నివాసానికి పెట్టిన నేమ్ ప్లేట్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రాయించిన తెలంగాణ భవన్ అధికారులు… ఉర్దూని విస్మరించారు. తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ ఉంది. ఉర్దూని విస్మరించి… మూడు భాషల్లో నేమ్ ప్లేట్ అధికారులు తయారు చేయించారు. ఈ క్రమంలో ఉర్దూని కూడా కలిపి మరో నేమ్ ప్లేట్ బోర్డు తయారు చేయించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.