Take a fresh look at your lifestyle.

తెలంగాణ మంత్రులకు ఎదురుదెబ్బలు

0 290

Hyderabad:- తెలంగాణ మంత్రులకు హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల పిటిషన్లపై మంత్రులు దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.
తెలంగాణ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పై హైకోర్టులో అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ తమ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్లను సవాల్ చేశారు. వీరి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టుకు షాక్ ఇచ్చింది. ధర్మపురిలో ఎమ్మె్ల్యేగా తన ఎన్నిక చెల్లదని కొప్పుల ఈశ్వర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కొట్టివేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదని 2018లో కాంగ్రెస్ నేత లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో రీకౌంటింగ్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. తన ఎన్నికల చెల్లదని లక్ష్మణ్ వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మంగళవారం కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై మూడు సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిగిందని, కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు పిటిషన్ కొట్టివేయాలంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. కొప్పుల ఈశ్వర్ ఎన్నికపై దాఖలైన పిటిషన్ పై బుధవారం విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు నియమించిన కమిషన్ ముందు మంత్రి కొప్పుల ఈశ్వర్, లక్ష్మణ్ తమ వాంగ్మూలం వినిపించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ కొట్టివేత
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ ను గతవారం హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదని మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో పిటిషన్‌ వేశారు. ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్‌లో ప్రకటించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. రాఘవేంద్రరాజు పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ పిటిషన్ పై ఇటీవల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చింది.

ట్యాంపరింగ్ కేసు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎలక్షన్‌ అఫిడవిట్‌ ట్యాంపరింగ్ వివాదంపై సోమవారం తీర్పు ఇచ్చిన కోర్టు మంత్రిపై ట్యాంపరింగ్‌ కేసు పెట్టాలని ఆదేశించింది. మంత్రితో పాటు ఐఏఎస్ అధికారులపై కేసులు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర, కేంద్ర రిట్నరింగ్‌ ఆఫీసర్లపై కూడా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ అవాస్తవమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేయించారని దీనివెనుక మాజీ మంత్రి, మాజీ ఎంపీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించారు.

మంత్రి గంగులపై
మరో మంత్రి గంగుల కమలాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. గంగుల కమలాకర్ పై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు రిటైర్డ్ జడ్జి శైలజతో కమిషన్ ఏర్పాటుచేసింది. ఆగస్టు 12 నుంచి 17తేదీ వరకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.