Take a fresh look at your lifestyle.

బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0 176
  • ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, డాక్టర్ ధనంజయ్ నాయక్ సంయుక్తంగా రాసిన బంజారా చరిత్ర
  • మొదటి ప్రతిని రేవంత్ రెడ్డికి అందించిన రచయితలు
  • లిఖిత చరిత్రలేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను కలిగి ఉందన్న సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ‘బంజారా చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, మాజీ సీటీవో డాక్టర్‌ ధనంజయ్‌నాయక్ సంయుక్తంగా ‘బంజారా చరిత్ర’ పుస్తకాన్ని రచించారు. ఆవిష్కరణ అనంతరం రచయితలు మొదటి ప్రతిని… రేవంత్‌రెడ్డికి అందించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… లిఖిత చరిత్రలేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను పుస్తకరూపంలో సమాజానికి అందించడం అభినందనీయమన్నారు. బంజారాల చరిత్ర ఎంతో గొప్పదన్నారు. వీరి చరిత్రను గ్రంథస్తం చేసేందుకు విశేష కృషి చేసిన రచయితలను అభినందించారు.

రచయితలు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింప చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.