భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, ఎల్లుండి (శుక్ర, శనివారాలు) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అదే సందర్భంలో ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ను సీఎం ఆదేశించారు. కాగా, మరో రెండు మూడు రోజులుభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు గురు, శుక్రవారాల్లో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.