- పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు
- మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ బెదిరించే లైసెన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య
- ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్న అధ్యక్షుడు
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదxటి అంతర్జాతీయ పర్యటన చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జు భారత్‌పై పరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో దేశం మమ్మల్ని బెదిరించడాన్ని లేదా అవమానించడాన్ని అనుమతించేది లేదన్నారు. ఆయన పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి అన్నారు. మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మీకు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై భారత్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన వెలువడలేదు.
ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్నారు. తమ దేశం చిన్న చిన్న ద్వీపాల సమూహం అయినప్పటికీ 900,000 చదరపు కిలో మీటర్ల విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలిని కలిగి ఉన్నామన్నారు. ఈ మహా సముద్రంలో అత్యధిక వాటాను కలిగి ఉన్న దేశాలలో మాల్దీవులు ఒకటి అన్నారు. మాల్దీవులు స్వతంత్ర, సార్వభౌమ రాజ్యమన్నారు. మాల్దీవుల దేశీయ వ్యవహారాలపై చైనా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.