Take a fresh look at your lifestyle.

షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే ? ఏపీలో ఏం జరగబోతోంది

0 293

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపే లక్ష్యంతో ఏడాది క్రితం వైఎస్సార్టీపీని స్ధాపించారు. అప్పట్లో తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర కూడా చేశారు. అయితే తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పోటీ పడి నెగ్గలేమనుకున్నారో ఏమో.. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేయాలనే నిర్ణయానికి షర్మిల వచ్చేశారు. ఈ వారంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా వైఎస్సార్టీపీని విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశాక ఏం జరగబోతోందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే తెలంగాణ కేంద్రంగా రాజకీయాలు చేసేందుకు షర్మిల తన పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె పార్టీని విలీనం చేసినా కీలక పాత్ర ఇవ్వొద్దంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు. గతంలో వైఎస్సార్, జగన్ విషయంలో తెలంగాణలో కనిపించిన వ్యతిరేకతను ఇందుకు కారణంగా చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచనలో పడింది. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేశాక ఆమెను తమ పార్టీ పూర్తి బలహీనంగా ఉన్న ఏపీకి పంపితే ఎలా ఉంటుందని అగ్రనేతలు అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఈ వ్యవహారంపై స్పందించారు. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే ఏపీలో మారబోయే పరిస్ధితుల్ని ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. షర్మిల పార్టీ విలీనం జరిగితే ఏపీలో వైసీపీకి రాజకీయంగా నష్టం తప్పదని ఆయన వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తన తండ్రి వైఎస్సార్ రుణం తీర్చుకున్నట్లు అవుతుందని రఘురామ వెల్లడించారు. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి చూస్తే పైనుంచి వైఎస్సార్ కిందకు వచ్చినా ఓటు వేయరన్నారు. తద్వారా జగన్ పై విద్వేషాన్ని, షర్మిల రాకతో వైసీపీకి జరిగే నష్టాన్ని రఘురామరాజు చెప్పుకొచ్చారు. అయితే షర్మిల మాత్రం ప్రస్తుతానికి అయినా ఏపీలో కాకుండా తెలంగాణలో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.