Take a fresh look at your lifestyle.

BJP: ఎమ్మెల్యే అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసిన బీజేపీ

0 57

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఖరారైన అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. మొత్తం నాలుగు విడతల్లో వంద స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 8 సీట్లు కేటాయించింది. తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు సాగుతున్నాయి. మరో పదకొండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. నేడు ఖరారైన జాబితాలో… కంటోన్మెంట్ – కృష్ణప్రసాద్, నాంపల్లి – రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్, మేడ్చల్ – రామచంద్ర రావు, పెద్దపల్లి – ప్రదీప్ కుమార్, సంగారెడ్డి – పులిమామిడి రాజుకు కేటాయించారు.

Leave A Reply

Your email address will not be published.