వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రెండు మూడు వార్డుల కౌన్సిలర్లు శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ, రెండవ ఒక వార్డు కౌన్సిలర్ రమాదేవి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ పద్మమ్మ, నాయకులు పరశురాం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి చిన్నారెడ్డి తో పాటు వెళ్లి కలిశారు.