Take a fresh look at your lifestyle.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ల మధ్య వర్గపోరు

0 16,700
  • నిత్యం న్యూస్ పేపర్లకు లీకులుస్తున్న అధికారులు ఎవరు?
  • రెండుగా చీలిపోయిన సూపరెండేంట్లు…మధ్యలో నలిగిపోతున్న సీఐలు
  • కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు
  • గత పదేళ్ళలో ఈఎస్ లు ఆడిందే ఆట పాడిందే పాట
  • వ్యక్తిగత కక్షలతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను రచ్చకీడుస్తున్నది ఎవరు?

ఎక్సైజ్ శాఖలో వర్గపోరుపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు మీడియాకు లీకులిస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరువును బజారుకీడుస్తున్నారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి దగ్గర ఒక వెలుగు వెలిగిన అధికారులు ప్రస్తుతం ఒకరంటే ఒకరికి పడే పరిస్థితి లేదు. వాళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తిగత వైరంను డిపార్ట్మెంట్ కు రుద్దుతూ ఎక్సైజ్ శాఖ ఉనికి ప్రశ్నార్థకంగా మారిలే చేశారని తెలుస్తోంది.

గత పదేళ్ల కాలంలో కొందరు అధికారులు సిఐ నుండి ఈఎస్ వరకు ఏళ్ల తరబడి ఒకే జిల్లాలో ఉద్యోగాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈఎస్ స్థాయి అధికారి వర్గం…అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రికి దగ్గరగా ఉన్న ఈఎస్ ల వర్గం రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు న్యూస్ పేపర్లకు లీకులు ఇచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న కొంతమంది ఉద్యోగులు రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదని ఇంకో వర్గం బాహాటంగానే మీడియాకు లీకులు ఇస్తున్నారట.

ఇదిలావుండగా ఈవర్గ పోరులో తాము బలైపోతున్నామని కిందిస్థాయి సిఐ,ఎస్ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ ల వర్గపోరుతో కింది స్థాయి సీఐల మీద తప్పుడు కథనాలు రాపిస్తూ…డిపార్ట్మెంట్ లో ఫిర్యాదులు చేస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ లీకు వీరులను ప్రభుత్వం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ లో కొందరు అధికారుల అవినీతి చిట్టాను ఆ శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరడం, దీంతోపాటు పలువురు అధికారులపై ఎసిబి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను ప్రక్షాళన చేయాలని కూడా నిర్ణయించినట్టుగా సమాచారం.

త్వరలో…పూర్తిస్థాయి ఆధారాలతో ఫుల్ లెన్త్ #Exclusive స్టొరీ

Leave A Reply

Your email address will not be published.