- ఫామ్‌హౌస్‌లో కాలుజారి కిందపడిన బీఆర్ఎస్ అధినేత
- యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్
- హైదరాబాద్ నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు తెలంగాణకు రానున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో కాలుజారి కిందపడి గాయపడిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆసుపత్రిలో ఉండగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు.
కాగా, ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి రేపు హైదరాబాద్ వస్తున్నారు. నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు.