Take a fresh look at your lifestyle.

సచిన్ రికార్డ్‌ను అధిగమించిన కోహ్లీ.. ఆనంద్ మహీంద్రా స్పందన

0 476
  • న్యూజిల్యాండ్‌తో వన్డే మ్యాచ్‌లో విరాట్ 50వ శతకం
  • సచిన్ రికార్డును అధిగమించిన వైనం
  • పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్రా హర్షం, అద్భుతంగా ఉందని కితాబు

కింగ్ కోహ్లీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న తొలి సెమీస్‌లో 50వ వన్డే సెంచరీ బాదిన విరాట్.. సచిన్ రికార్డును అధిగమించాడు. 50 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

విరాట్ రికార్డు చూసి యావత్ భారత్ మురిసిపోతున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా తనదైన శైలిలో స్పందించారు. మరో లెజెండ్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడంటూ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తారు. విమానవాహక నౌకపై యుద్ధ విమానాన్ని ఓ పైలట్ అత్యంత నేర్పుగా ల్యాండచేసిన దృశ్యాన్ని షేర్ చేసిన ఆయన.. విరాట్ శతకం కూడా ఇంతే అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాగా, నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కోహ్లీ(117), శ్రేయస్(105) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ మూడు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్‌ ఓ వికెట్ తీశారు.

Leave A Reply

Your email address will not be published.