Take a fresh look at your lifestyle.

‘ఎన్‌బీకే 109’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. బాలయ్య నుంచి మరో మాస్ మసాలా

0 111
  • బాబీ దర్శకత్వంలో బాలయ్య 109 మూవీ
  • నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
  • గొడ్డలిపై కళ్లజోడు, తాయెత్తుతో స్టన్నింగ్ పోస్టర్

భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న నందమూరి బాలకృష్ణకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. యువ దర్శకుడు బాబీతో తన 109 సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. నేడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇందుకు సంబంధించి బాబీ తన ఎక్స్ ఖాతాలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గొడ్డలకి కళ్లజోడు పెట్టినట్టు ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటేనే ఇది పూర్తిగా మాస్ మసాలా మూవీ అని అర్థమవుతోంది. గొడ్డలిపైన ఆంజనేయస్వామి బిళ్ల కూడా ఉంది. కళ్లద్దాల ప్రతిబింబంలో రాక్షసుడిపైకి నరసింహస్వామి దూకుతున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన బాబీ..  ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’, ‘వయలెన్స్‌ కా విజిటింగ్‌ కార్డ్‌’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.