Take a fresh look at your lifestyle.

ఆర్ధరాత్రి వీధుల్లో మృగరాజు స్వేచ్ఛావిహారం.. వైరల్ వీడియో ఇదిగో!

0 108
  • ఇటలీలో ఇటీవల వెలుగు చూసిన ఘటన
  • సర్కస్ నుంచి తప్పించుకున్న సింహం
  • లాడిస్‌పోలీ టౌన్ వీధుల్లో స్వేచ్ఛగా సంచారం
  • కొన్ని గంటల తరువాత సింహాన్ని బంధించి సర్కస్‌కు అప్పగించిన అధికారులు

ఇటలీలో ఓ సింహం రాత్రి వేళ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాడిస్‌పోలీ అనే టౌన్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. సింహరాజాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూనే ఆవేదన కూడా వ్యక్తం చేశారు.

స్థానికంగా ఉన్న ఓ సర్కస్‌ కంపెనీ నుంచి ఈ సింహం తప్పించుకుంది. దీంతో, అక్కడి మేయర్ స్థానికులను అప్రమత్తం చేశారు. సింహాన్ని మళ్లీ బంధించేంత వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. దీంతో, ఇళ్లల్లోనే ఉండిపోయిన ప్రజలు సింహం తమ వీధిలోకి రావాలని కోరుకున్నారు. కొందరి కోరిక నెరవేరి సింహం రాజసంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కొందరి కంట పడ్డాయి. చివరకు ఈ వీడియోలు నెట్టింట బాటపట్టాయి.

తమ జీవితంలో తొలిసారిగా సింహం స్వేచ్ఛ అనుభవించడం చూసి అనేక మంది సంతోషించారు. మృగరాజాన్ని ఈ కాలంలోనూ బోనులో పెట్టడం అమానుషమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కొన్ని గంటల పాటు శ్రమించిన భద్రతాసిబ్బంది సింహాన్ని బంధించి సర్కస్‌కు అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.