తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్‌లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ నేతలు మేడ్చల్‌కు ఐటీ పార్క్ తీసుకువస్తామని చెప్పారని, కానీ ఏమయిందో చెప్పాలన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంశంపై కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకువచ్చినా తరలించలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ.2500 అందిస్తామన్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రూ.400గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.12వేలు అందిస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.