Take a fresh look at your lifestyle.

కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు: కేటీఆర్

0 94
  • పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పొరపాట్లు జరిగాయన్న కేటీఆర్
  • కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులు లేవన్న కేటీఆర్
  • కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శలు

ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌పై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న లోపాల వల్ల మాత్రమే ఓడిపోయిందన్నారు.

కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి నాయకులు కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు మొదలు వివిధ అంశాలపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి,  420 హామీలు ఇచ్చి గెలిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.